పువ్వు...అపూర్వం. ఓ అనిర్వచనీయ ఆనందం.. ఆ సుగంధం మైమరపించే సుమధురం. చూడగానే పులకించనిదెవరు? అటువంటి పరిమళాన్ని ఆస్వాదించని వారుంటారా? ప్రపంచంలో అతి పెద్దవి..అతి చిన్నవి ఏవైనా మనల్ని సంభ్రమపరిచేవే. ఆ కోవలోనివే రఫ్లేసియా అర్నాల్డీ, అమెర్ఫాఫలస్ పుష్పాలు. రఫ్లేసియా అర్నాల్డీ భూమ్మీద అతిపెద్ద పువ్విది.ఇండోనేసియా జాతీయ పుష్పం కూడ.ఒకరకంగా ఇదో అడవి పువ్వు.ఇండోనేసియా, మలయ,బెర్నొయ్,సుమత్రా,ఫిలిప్పీన్స్ అడవుల్లో మాత్రమే ఈ పువ్వులు విస్తారంగా కనిపిస్తాయి. ఇదో ఎండెమిక్ ఫ్లవర్.దీనికి మరో పేరు కార్ప్స్ ఫ్లవర్.ఏకంగా 3 అడుగుల(90 సెంటీమీటర్లు)మేర పెరుగుతుంది.బరువు 11 కిలోలకు పైమాటే.పుష్పించాక అంతే గాఢమైన సుగంధాన్ని వెదజల్లుతుంది.ఈ పువ్వు కొద్దీ రోజుల్లోనే భారీతనాన్ని సంతరించుకుంటుంది.పుష్పించడం మొదలయ్యే దశలో దీని పరిమాణం కేవలం 0.08 అంగుళాలు మాత్రమే. ఈ ముదురు ఎరుపు రంగు రఫ్లేసియాకు ఇతర పూల మొక్కల్లా ఆకులు,కాండం,కొమ్మలు వగైరాలుండవు.నేలపై పరుచుకున్న తీగలపైనే ఈ భారీ పువ్వులు పుష్పిస్తాయి.ఈ పువ్వు పరిమళం కూడా చాలాకాలమే ఉంటుంది.ప్రస్తుతం ఈ పువ్వుల్ని ప్రపంచ ప్రసిద్ధ బొటానికల్,నేషనల్ పార్క్‌లన్నింటిలోనూ చూడొచ్చు.
ప్రకృతి అందానికి వన్నెలద్దే వాటిలో మొక్కలు,చెట్లదే ప్రథమస్థానం. సకల జీవకోటికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇంకా అందుతుండడానికి ఇవే కారణం.ముఖ్యంగా పగటి వేళల్లో ఇవి కార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరించి ఆక్సిజన్‌ను విడుదల చేయడమనే మహోపకారాన్ని విస్మరించలేం కదా.
అతి పొడవైన పువ్వు: చెట్లను తలపించే మొక్కలు వాటికి భారీ పువ్వులు,పొడవైన పుష్పాలు ఇలా అనేక రకాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.రఫ్లేసియా అర్నాల్డీకి పూర్తి భిన్నమైనది అమెర్ఫాఫలస్(టైటన్ అరమ్).ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పువ్వు.దాదాపు 10 అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది.రోజుకు ఈ పువ్వు నాలుగు నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఏకంగా 50 కిలోల బరువు తూగుతుంది.ఈ పువ్వులో కనిపించని రంగే ఉండదు.ఎరుపు,తెలుపు,ఆకుపచ్చ,పసుపు వర్ణాల సమాహారంగా భారీ ఆకారంతో వారెవ్వా అనిపిస్తుంది.అయితే ఈ పువ్వు రెండు మూడు రోజులకే వాడిపోతుంది.ఈ పువ్వు వెన్నంటి ఉండే ఆకులూ చాలా పెద్దగా ఉంటాయి.ఎంతంటే 20 అడుగుల మేరంటే ఆశ్చర్యమేగా.ఈ మొక్క ఆకులు ఏడాదికోసారి రాలిపోతాయి.మళ్లీ నాలుగు నెలల్లోగా కొత్త ఆకులు మొలుస్తుంటాయి.మీజ్‌లో గల బెల్జియన్ బొటానిక్ గార్డెన్స్‌కు వచ్చే సందర్శకులకు ఈ పువ్వు ఓ కనువిందే.లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో ఈ పువ్వులు 100 వరకు ఉండడంతో జనం వీటిని చూసి పులకించిపోతుంటారు.బాన్(జర్మనీ)లోని బొటానికల్ గార్డెన్స్‌లో 2003లో ఈ పువ్వు 8అడుగుల 11 అంగుళాల ఎత్తుకెదిగి గిన్నీస్‌బుక్ రికార్డులకెక్కింది.2005లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోగల బొటానికల్ అండ్ జులాజికల్ గార్డెన్స్‌లో ఉన్న ఈ జాతి పువ్వు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో అంతకుముందు నమోదైన రికార్డును బద్దలకొట్టింది.
భారీ పువ్వులు,మొక్కలు:కొరిఫా అంబ్రకులిఫెర(టలిపాట్ పామ్)-ప్రపంచంలోనే అతి పెద్ద కాండం గల మొక్క.శ్రీలంక దీని స్వస్థలం.స్టపెలియా(స్టార్ ఫ్లవర్),స్టపెలియా లెపడ్-దక్షిణాఫ్రికా),హైడ్నొర ఆఫ్రికన-జాంబియా, హెలికొడై సెరస్ మస్విరస్(డెడ్ హార్స్ అరమ్ లిలీ),డ్రాకన్‌క్యూలస్ వల్గరిస్(వుడు లిలీ).
No comments:
Post a Comment