సకల చరాచర సృష్టికి నీరే మూలం.ప్రకృతి వరప్రసాదితం నీరు.జీవులన్నింటికి ప్రాణాధారం.మరి యంత్రాలకూ ఆ నీరే శక్తిగా మారితే? అవి ఆ నీటితోనే కదలాడితే అబ్బురమే కదా!కాలం మారింది..వేగం పెరిగింది.ఎన్నో ఆవిష్కరణలు..గతంలో ఆడంబరాలనుకునేవి నేడు అవసరాలయ్యాయి.ఇది యాంత్రికయుగం కావడంతో వాహనాలు సామాన్యులకు సైతం తప్పనిసరిగా కావాల్సి వస్తోంది.ఆ క్రమంలోనే వాహనాల సంఖ్య వాహన వినియోగదారుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.అంతర్జాతీయ విపణిలోకి ఎన్నోన్నో వాహనాలు కొత్త ఫీచర్లు,మోడళ్లతో దూసుకువస్తున్నాయి.అయితే ఆ వాహనాలన్నింటికీ ప్రధాన ఇంధనం పెట్రోలే.అందుకే నిత్యం పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు.అదే సామాన్య వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతోంది.గతంలో డీజిల్ వాహనాలు ఆ తర్వాత పెట్రోలు వాహనాలు ఆపై ఎలక్ట్రిక్ ఇప్పుడు సి.ఎన్.జి(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఆధారిత వాహనాలు తెరపైకి వచ్చాయి.ఇవన్నీ వాహనదారుల జేబు చమురునే వదిలిస్తున్నాయి.దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఆవిష్కరణలు అందరికీ ఆనందదాయకమే అనడంలో సందేహం లేదు.90వ దశకంలో భారత్((తమిళనాడు)లో రామన్‌పిళ్లై మూలికా ఇంధనాన్ని సృష్టించానన్నారు.పెట్రోల్‌కు ఇదే కచ్చితమైన ప్రత్యామ్నాయమని ఎన్నో ప్రదర్శనలు చేశారు.అయితే ఆ తర్వాత పిళ్లై ప్రయోగాలు విఫలం కావడం భారత్ వంటి వర్థమానదేశాల వాహన వినియోగదారుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.కానీ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తమ మెదళ్లకు పదును పెట్టి సరికొత్త పరిశోధనలను ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.

పర్యావరణం-భద్రం:సిఎన్‌జి,ఎలక్ట్రిక్ మోడ్ వాహనాల మాదిరిగా ఈ వాటర్ కార్ల వల్ల ఎటువంటి వాతావరణ కాలుష్యం ఉండదు.ఈ డబ్లూఇఎస్ పరిజ్ఞానంపై నిజానికి నూరేళ్ల క్రితం నుంచే బ్రిటన్,ఆస్ట్రేలియా,అమెరికా,రష్యా తదితర దేశాల శాస్త్రవేత్తలు దృష్టిని సారించారు.రష్యా శాస్త్రవేత్తలు తొలుత ఓ నౌకను నీటి ద్వారా నడిపించేందుకు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.సముద్రపు జలాల నుంచే హైడ్రోజన్‌ను సేకరించి షిప్ నడిచేలా సాంకేతికతను రూపొందించారు.ఈ పరిజ్ఞానాన్ని ఓ.ఎమ్. గా వారు స్థిరపరిచారు.ఈ డబ్లూ.ఇ.ఎస్ పరిజ్ఞానం మరింత ప్రగతిని సాధిస్తే ఒక్క కార్లేంటి ఏకంగా విమానాలు,రాకెట్లు,సబ్‌మెరైన్లను కూడా నీళ్లతోనే నడిపించేయొచ్చంటున్నారు.
No comments:
Post a Comment