(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome) నయగరా..నయనానందకర జల హేల. భూతల స్వర్గమని మనం పిలుచుకునే అమెరికా,కెనడా సరిహద్దులలో ఉందీ జలపాతం. వరల్డ్‌లో అతిపెద్ద జలపాతమైన విక్టోరియా(దక్షిణాఫ్రికా)తర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్నరకు పైబడి పర్యాటకుల సందర్శనతో ఈ జలపాత ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి.అమెరికన్ ఫాల్స్((ప్రాస్పెక్ట్ పాయింట్-లునా ఐలాండ్))), బ్రిడల్ వీల్‌ఫాల్స్(((లునా ఐలాండ్- గోట్- ఐలాండ్),కెనడియన్ ఫాల్స్(గోట్ ఐలాండ్--- టేబుల్ రాక్)అనే మూడు జలపాతాల సమాహారమే ఈ నయగరా జలపాతం.అమెరికన్ ఫాల్స్,బ్రిడల్ వీల్‌ఫాల్స్ 176 అడుగుల ఎత్తున ఉన్న కొండ కొనల నుంచి పాల నురగల్ని తలపించే జలసిరులు దిగువనకు ఎగసిపడుతూ ఉరకలెత్తుతుంటాయి.ఈ ప్రాంతంలో దాదాపు లక్షా 50 వేల గ్యాలన్ల నీరు పారుతుంది.జూన్,జులై,ఆగస్టుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు.
కెనడియన్(హార్స్‌షూ)ఫాల్స్ నుంచి జలాలు 167 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటాయి.ఇక్కడ సుమారు ఆరు లక్షల గ్యాలన్ల నీరు ప్రవహిస్తూంటుందని యూఎస్ జియోలాజికల్ (యూఎస్‌జిఎస్)) పేర్కొంది.ఈ జలపాతానికి మూలం నయగరా నది.మంచు యుగం కాలం నాటిదిది.దీని వయస్సు 18వేల ఏళ్లు.మూడు కిలోమీటర్ల ఎత్తున పేరుకుపోయిన మంచుపలక వేల ఏళ్ల క్రితం కరగడంతోనే నదులు,సరస్సులు ఈ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి.దక్షిణ అంటారియో ప్రాంతంలో నెలకొందీ అద్భుత జలపాతం. నయగరా పెనిన్సులాలో 12 వేల ఏళ్ల క్రితమే మంచుప్రాంతం అదృశ్యమయింది.ఈ మంచుఖండం మాయమయ్యాకే ఎరై సరస్సు, నయగరా నది,అంటారియో సరస్సు,లారెన్స్ నదులు ఏర్పడ్డాయి.ఈ మొత్తం జలాలన్నీ కొండలకోనల నుంచి పారుతూ చూడచక్కని జలపాతాలై దిగువనకు ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలుస్తున్నాయి.వండర్ నయాగరా:క్వీన్‌స్టన్-.-లూయిస్టన్ ప్రాంతంలో నయగరా జలపాత హోయల్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఆనందోత్సాహాలతో తిలకించి పులకించిపోతుంటారు.ఈ జలపాత ప్రాంత సమీపంలోకి చేరుకుంటుండగానే మంచు బిందువులు,నీటి తుంపర్లతో అతిథులను పలకరిస్తూ నయగరా స్వాగతం పలుకుతుంది.ఇక్కడ బటర్‌ఫ్లై కన్జర్వేటరీ,మేరీలాండ్ ఆహ్లాదాన్ని పంచుతాయి.బఫెలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి,టొరంటో(కెనడా)వైపు నుంచి ఈ జలపాత ప్రాంతానికి అరగంట ప్రయాణించి చేరుకోవచ్చు. నయగరా జలపాత మార్గంలో ఆరు అపురూపమైన బ్రిడ్జిలూ భలే ఆకట్టుకుంటుంటాయి.ఈ వంతెనలన్నీ కెనడా,అమెరికా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడే నయగరా నదిపై నిర్మితమయ్యాయి.నాలుగు చక్రాల వాహనదారులు,పాదచారులు కూడా ఈ వంతెనలపై ప్రయాణిస్తుంటారు.వీటిలోనే రెండు రైలు వంతెనలు కూడా ఉన్నాయి.అవి..పీస్ బ్రిడ్జ్,రెయిన్‌బో బ్రిడ్జ్,వర్ల్‌పుల్ బ్రిడ్జ్,లూయిస్టన్-క్వీన్‌స్టన్ బ్రిడ్జ్,మిచిగన్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్,ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్.
జల విద్యుదుత్పాదన:అమెరికాలోని రాబర్ట్ మోజెస్((జిఎస్)24 లక్షల కిలోవాట్స్,లూయిస్టన్ పంప్((జిఎస్)3 లక్షల కిలోవాట్స్ చొప్పున 27 లక్షల కిలోవాట్స్ జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.కెనడా వైపు నుంచి సర్ అడమ్ బెక్(1(జిఎస్)5లక్షల కిలోవాట్స్,సర్ అడమ్ బెక్‌బ(2జిఎస్)) లక్షల కిలోవాట్స్,సర్ అడమ్ బెక్‌పీస్((జిఎస్)లక్షా 75వేల కిలోవాట్స్,డెక్యూ(జిఎస్)కెథరిన్ 23వేల కిలోవాట్స్,డెక్యూ(2జిఎస్)కెథరిన్ లక్షా44వేల కిలోవాట్స్ చొప్పున మొత్తం సుమారు 24లక్షల కిలోవాట్స్ జల విద్యుదుత్పాదన చేస్తున్నారు.
No comments:
Post a Comment