(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
మనిషి గాల్లో,నీటిలో,అంతరిక్షంలోనూ నేడు విహరిస్తున్నాడు.కానీ శాశ్వత నివాసం మాత్రం భూమి పైనే.మరి భూమి లోపల ఇళ్లు కట్టుకొని జీవించడం సాధ్యమేనా?ఈ ప్రశ్నకు కచ్చితంగా అవుననే సమాధానమిస్తున్నారు కూబర్‌పెడి భూగర్భ పట్టణ వాసులు.నార్తరన్ సౌత్ ఆస్ట్రేలియాలో ఏకంగా ఓ పట్టణమే భూమి అడుగున నిర్మితమయింది.బహుశా ప్రపంచంలోనే ప్రస్తుతం ఇలా భూగర్భంలోగల ఏకైక పట్టణం ఇదేనేమో.ఇది ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత టూరిజం స్పాట్‌గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.
ప్రఖ్యాత రాతి గని: వాస్తవానికి కూబర్‌పెడి ప్రపంచ ప్రసిద్ధ రాతి గనుల ప్రాంతం.1858లోనే ఇది వెలుగులోకి వచ్చింది.అయితే 1916 నుంచే ఇక్కడ జనావాసాల ఆలోచనకు అంకురార్పణ జరిగింది.ఆడిలైడ్‌కు ఉత్తరం నుంచి ఈ ప్రాంతం 846 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక్కడ ఒపల్ గనులు దాదాపు 5వేల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్నాయి.కూబర్‌పెడికి వెళ్లేందుకు స్టౌర్ట్ హైవే నుంచి రోడ్డు మార్గం ఉంది.ఈ భూగర్భ పట్టణంలో 2006 జనాభా లెక్కల ప్రకారం సుమారు రెండువేల మంది శాశ్వత నివాసితులున్నారు.వీరి ఇళ్లను డగౌట్స్ అంటారు.కూబర్‌పెడి భూగర్భ పట్టణంపైనున్న భూఉపరితలంపై మూడు భవంతులున్నాయి.అందులో ఒకటి హాస్పిట్ భవనం.ఈ భూగర్భ పట్టణంలో ఇళ్లే కాక మ్యూజియాలు,షాపులు,ఆర్ట్ గ్యాలరీలు,చర్చ్‌లు,హోటళ్లు భూఉపరితల నగరాల్లో ఉన్న సకల సౌకర్యాలను తలదన్నెలా నిర్మితమయ్యాయి.అందుకే ఏటా ఈ పట్టణ సందర్శనకు దాదాపు లక్షమంది వచ్చి సంభ్రమాశ్చర్యాలతో తిరిగి వెళ్తుంటారు.
సమాచార ప్రవాహం: కూబర్‌పెడి వాసులకు రేడియో, టి.వి, పేపర్ సౌకర్యాలు న్నాయి. ఎబిసి నేషనల్ రేడియో, డస్ట్ రేడియో, ఫ్లో ఎఫ్.ఎం, కామా రేడియో సమాచార సేవలతో పాటు ఇంపర్జా టీవీ, సెవెన్ సెంట్రల్, ఎబిసి, ఎస్‌బిఎస్ చానళ్లు అందుబాటులో ఉన్నాయి.ఇవే కాకుండా వీక్లీగా వెలువడే కూబర్‌పెడి న్యూస్ పేపర్ లభ్యమౌతోంది. 2013లోగా డిజిటల్ టీవీ చానల్ భాగ్యాన్ని కల్గించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూబర్‌పెడికి 42కిలోమీటర్ల దూరాన ఉన్న మంగురి సైడింగ్ వరకు ఆడిలైడ్ నుంచి రైళ్లు నడుస్తుంటాయి. అయితే ఈ పట్టణానికి రాకపోకలు సాగించేందుకు పగటి వేళల్లోనే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో చోటుచేసుకునే అతిశీతల వాతావరణమే అందుకు కారణమట.
ఉల్లాసాల వాతావరణం: కూబర్‌పెడిలో ఏడాది పొడవునా వాతావరణం ఆహ్లాదంగానే ఉంటుంది. అది వేసవి కాలమైనా అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించదు. ఇక శీతాకాలమైనా కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగదు. అయితే ఈ భూగర్భ పట్టణంలో ఓసారి అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా, అత్యల్ప ఉష్ణోగ్రత -2 డిగ్రీలగా నమోదయినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది మొత్తం తేమ శాతం కూడా సమతూకంతోనే ఉంటుందట. ఈ పట్టణంలో ఒక్క గడ్డిపోచ సైతం కనిపించదు.ఒక చెట్టు మాత్రం ఉంది. అది దుక్క ఇనుముతో తయారైనది,ఓ కొండ కొనపై ఇక్కడ కూబర్‌పెడి పట్టణం ఉందన్న సంకేత సూచికగా అది నిలిచి ఉంది.
వరల్డ్ అండర్‌గ్రౌండ్ చర్చ్‌లు:బ్లెస్డ్ కింగ్ చాపెల్(క్రాకౌ,పోలెండ్);కెటకోంబ్ అండర్‌గ్రౌండ్ చర్చ్(రోమ్,ఇటలీ);సెయింట్ కింగ్స్ చాపెల్;జిపాక్విర్(కొలంబియా,యూఎస్);చర్ఛ్ ఆఫ్ సెయింట్ జాన్(పిక్చరెస్క్యూ,ఫ్రాన్స్).
No comments:
Post a Comment