క్రికెట్..ఇదో మేనియా. నేడు ప్రపంచ జనాభాలో దాదాపు మూడొంతుల మందిని ఊర్రూతలూగించే ఏకైక క్రీడ.అన్ని ఖండాల్లోను క్రమక్రమంగా శరవేగంగా ప్రాచుర్యం పొందుతోందనడం అతిశయోక్తి కాదు.ఇంగ్లండ్‌లో రూపుదిద్దుకుందీ ఆట.1877లోనే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగ్గా 1973లో ఈ రెండు జట్లే తొలి వన్డే పోటీలోనూ తలపడ్డాయి.భారత జట్టు 1937లో టెస్టుల్లో,1974లో వన్డేల్లో అరంగేట్రం చేసింది.ప్రస్తుతం 20-20 మ్యాచ్‌ల హవా కొనసాగుతున్నా టెస్టులు,వన్డేల ప్రాధాన్యం యథావిధిగా సాగుతోంది.టెస్టులకు కొంత ఆదరణ తగ్గినా ఇప్పటికీ రంజుగా సాగే మ్యాచ్‌లకు కొదవ లేదు.ఆ క్రమంలోనే రికార్డుల షరా మామూలే.క్రికెట్ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి.అందులో భాగమే ఇటీవల డాషింగ్ రేసర్ వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు 219ను వెస్టిండీస్‌పై నెలకొల్పాడు. టెస్టులో ట్రిపుల్ వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడయ్యాడు.ప్రత్యర్థి జట్టు ఏదైనా బౌలర్ ఎవరైనా అది టెస్టయినా వన్డే అయినా అసలు క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా `వీరు`డిది అదే దూకుడే..ఒక్కటే బాదుడు.అదే అతని రోల్‌మోడల్ సచిన్ నెలకొల్పిన వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ రికార్డును ఏడాది తిరగకముందే అందుకునేలా చేసింది.
*టెస్టు హోదా పొందిన దేశాలు: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్.
ఎవర్‌గ్రీన్ రికార్డు:ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మన్ కేవలం 52 టెస్టులాడి సగటున 99.94 పరుగులను సాధించారు.
క్వాడ్రపుల్ సెంచరీ: టెస్టులో 400* రికార్డును సాధించిన ఏకైక ఆటగాడు వెస్టిండీస్‌కు చెందిన బ్రియన్‌లారా.2004లో ఇంగ్లండ్‌పై నమోదు చేశాడు.
టెస్టుల్లో తొలి 10వేల పరుగులు: సునీల్ గవాస్కర్
వన్డేల్లో తొలి 10వేల పరుగులు: సచిన్‌టెండుల్కర్
వన్డేల్లో తొలి డబుల్ సెంచీరీ: సచిన్‌టెండుల్కర్
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీల హీరోలు: డాన్ బ్రాడ్‌మన్,వీరేంద్ర సెహ్వాగ్,క్రిస్‌గిల్,బ్రియన్‌లారా
ఓవర్‌లో ఆరు సిక్స్‌లు: 2007 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెర్షలీ గిబ్స్ కొట్టాడు.
ఇదే ఫీట్‌ను భారత్ ఆటగాడు యువరాజ్‌సింగ్ 20-20 మ్యాచ్‌లో సాధించాడు.తొలుత కౌంటీల్లో ఈ ఘనతను వెస్టిండీస్‌కు చెందిన సర్‌గ్యారీ సోబర్స్ సొంతం చేసుకున్నారు.రంజీల్లో భారత్‌కే చెందిన రవిశాస్త్రి కూడా ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టాడు.
వన్డే గ్రేట్ ఇన్నింగ్స్:
*వీరేంద్ర సెహ్వాగ్,భారత్(219)-2011(వెస్టిండీస్‌పై)
*సచిన్ టెండుల్కర్,భారత్ (200*)-2010(దక్షిణాఫ్రికాపై)
*చార్లెస్ కొవెంట్రి,జింబాబ్వే (194*)-2009(బంగ్లాదేశ్‌పై)
*సయ్యద్ అన్వర్,పాకిస్థాన్ (194)-1997(ఇండియాపై)
*వివ్ రిచర్డ్స్,వెస్టిండీస్ (189*)-1984 (ఇంగ్లండ్‌పై)
*సనత్ జయసూర్య,శ్రీలంక (189)-2000(ఇండియాపై)
*గ్యారీకిరిస్టెన్,దక్షిణాఫ్రికా (188*)-1996(యూఏఈపై)
*సచిన్ టెండుల్కర్,భారత్ (186*)-1999(న్యూజిలాండ్‌పై)
*షేన్‌వాట్సన్,ఆస్ట్రేలియా(185*)-2011(బంగ్లాదేశ్‌పై)
*ధోని,భారత్(183*)-2005(శ్రీలంకపై)
వన్డేల్లో తొలి గ్రేట్ ఇన్నింగ్స్ మాత్రం నిస్సందేహంగా డేర్‌డెవిల్ కపిల్‌దే.1983లో జింబాబ్వేపై అసలు సిసలైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను ఆయన ఆడాడు.ఇంగ్లండ్‌లో జరుగుతున్న మూడో ప్రపంచ(ప్రుడెన్షియల్)కప్‌లో 17 పరుగులకే భారత్ జట్టు అయిదు వికెట్లను కోల్పోగా కపిల్‌దేవ్ విరుచుకుపడి 175* పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు.అదే అప్పటి వరకు వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు.ఫలితంగా అండర్‌డాగ్ పొజిషన్‌లో బరిలో దిగిన భారత్ క్రికెట్‌లో అప్పటికి అమేయశక్తి అనదగ్గ వెస్టిండీస్‌ను ఓడించి వరల్డ్ కప్‌ను సాధించగల్గింది. ఆ తర్వాత మళ్లీ 28 ఏళ్లకు ధోని సారథ్యంలో భారతజట్టు రెండోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.అంతకు ముందు కూడా ధోని కెప్టెన్సీలోనే భారత్ జట్టు తొలి 20-20 వరల్డ్‌కప్‌ను సాధించడం తెలిసిందే.
_______________________________________________________________
* ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఎవరెస్టు (8848 అడుగులు)ను తొలిసారిగా అధిరోహించిన వారు: ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే
* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు:యూరిగగారిన్
* చంద్రుడిపై అడుగిడిన ప్రథముడు:నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
No comments:
Post a Comment