(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
లోకో భిన్నరుచి!..ఆ రుచినీ ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వీకరిస్తుంటే భలే మజా.అందుకు భూమి,ఆకాశం,నీటిపైనే కాదు సముద్రగర్భం కూడా వేదిక అయిందంటే ఆశ్చర్యంతోపాటు వింత అనుభూతినే కల్గిస్తుంది.సరిగ్గా అలాంటి థ్రిల్‌ను మనకు కల్పించే రెస్టారెంటే ప్రకృతి అందాలకు పర్యాయపదమైన మాల్దీవుల్లో ఉంది.2007లో మాల్దీవుల్లోని(రంగలిఐలాండ్)హిందూ మహాసముద్ర జలాల అడుగున నిర్మితమైన హిల్టన్ మాల్దీవ్స్ రిసార్ట్ అండ్ స్పాకు చెందిన ఇథా ప్రపంచంలోనే తొలి రెస్టారెంట్‌గా చరిత్రను లిఖించడమే కాక అలరిస్తోంది.అలల ఉధృతి లేని ప్రశాంత సముద్ర జలాల్లో ఒదిగి ఉన్న ఈ అద్దాల((అక్‌రిలిక్)హోటల్లో చూడ చక్కని చేపలు అసాంతం కదలాడుతుండగా ఊహల్లో తేలిపోతూ విందు ఆరగించడం ఎవరికైనా మరపురాని మధుర జ్ఞాపకమే.ఈ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు 270 డిగ్రీల కోణంలో సముద్ర గర్భాన నెలకొన్న అందాలను కన్నుల పండగ్గా తిలకిస్తుంటారని హిల్టన్ జనరల్ మేనేజర్ కార్‌స్టన్ షైక్ పేర్కొన్నారు.న్యూజిలాండ్‌కు చెందిన ఎంజె మర్ఫీ లిమిటెడ్ ఈ హోటల్‌ను రూపుదిద్దింది.సాధారణంగా అక్వెరియాల్లో తిరుగాడే రంగురంగుల చేపలనే మనం సంభ్రమంగా చూస్తుంటాం.ఈ హోటల్‌కెళ్తే మనమే అక్వెరియంలో ఉండగా చుట్టూ పరుచుకున్న సముద్ర జలాల్లో సంచరించే చేపల మధ్య ఇష్టమైన రుచులను ఆస్వాదించడమన్నది కచ్చితంగా సరికొత్త అనుభూతే.దాదాపు ప్రపంచ ప్రఖ్యాత వంటకాలన్నీ ఈ రెస్టారెంట్‌లో లభ్యమౌతాయి.అయితే మాల్దీవుల ప్రాంత జలాల్లో మాత్రమే దొరికే వైట్ ఫిష్,ఫెన్నెల్(ఓ రకం మొక్క)సాస్,కూర ఈ హిల్టన్ రెస్టారెంట్ స్పెషల్.ఈ హోటల్లో నుంచి తాబేళ్లు,వివిధ రకాల చేపలు,మొక్కలు,అనేక జలచరాల సహా షార్క్‌లను చూడ్డం అతిథుల్లో క్షణక్షణం అనంత ఉత్కంఠనే కల్గిస్తూంటుంది.
జూల్స్ లాడ్జ్-ఫ్లోరిడా(యూ.ఎస్):).. సముద్ర గర్భాన నిర్మితమైన హోటళ్లకు నిఖార్సయిన వేదిక దుబాయ్.ఇక్కడ ఈ తరహా హోటళ్లు అనేకం.అయితే అమెరికాలోని ఫ్లోరిడా(కీలార్గో)లోని జూల్స్ లాడ్జ్ సముద్ర జలాల అడుగున నిర్మితమైన తొలి హోటల్‌గా చరిత్రకెక్కింది.సముద్ర ఉపరితలం నుంచి 21 అడుగుల లోతున ఈ హోటల్ ప్రధాన ద్వారం స్వాగతం పలుకుతూ కనిపిస్తుంది.విలాసవంతమైన విశ్రాంత గదులకే కాదు స్కూబా డైవింగ్ కోర్సుకు ఈ జూల్స్ పేరొందింది.అంతేనా వివిధ నమూనా క్రీడా ప్రాంగణాలు,పార్క్‌లతో ఈ హోటల్ అతిథుల్ని ఉల్లాసపరుస్తోంది.అదేవిధంగా స్వీడన్(వెస్టారస్)లోని అట్టర్ ఇన్ కూడా ఈ తరహా హోటళ్లలో ఒకటిగా ఖ్యాతి గడించింది.ఈ హోటల్ సముద్ర ఉపరితలం నుంచి మూడు మీటర్ల లోతున నిర్మితమైంది.ఇక ఫిజిలోని పొజిడన్ హోటల్ కూడా ఇదే విధంగా సముద్ర జలాల్లో 40 అడుగుల లోతున నెలకొంది.2010లో టర్కీలో ఇస్తాంబుల్ హోటల్ కొలువుదీరింది.సెవెన్ స్టార్ హోదా గల ఈ హోటల్ ఏడు అంతస్తులతో సముద్ర గర్భంలో ఠీవీని ఒలకబోస్తోంది.అలాగే చైనాకు చెందిన షాంగై షిమొవ్ వండర్‌లాండ్ హోటల్‌ది ఫైవ్ స్టార్ స్టేటస్.వరల్డ్ అండర్ సీ టాప్ ఫైవ్ హోటళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న హోటల్ ఇది.2009 నుంచి ఈ హోటల్ అతిథులకు అందుబాటులోకి వచ్చింది.
______________________________________________________________
సిడ్నీ@100:వందో టెస్టుకు ఆతిథ్యం ఇస్తోన్న సిడ్నీ గ్రౌండ్‌లోనే భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 100@100...
No comments:
Post a Comment