smooth siva lingam


మంచిని నమ్మి చెడిన‌వారు లేరంటారు.ఓ సూప‌ర్ ప‌వ‌ర్ ఉంద‌ని న‌మ్మ‌డ‌మే భ‌క్తి.అది స‌న్మార్గానికే దిక్సూచి అవుతుంది గానీ ఏ చెడుపు చేయ‌దు.అయితే మేలే గానీ ఎంత‌మాత్రం కీడు జ‌ర‌గ‌ద‌నేది స‌నాతన ధ‌ర్మంగా ఇప్ప‌టికీ భాసిల్లుతోంది.అందుకే అనాదిగా హిందువుల్లో అనేకానేక విశ్వాసాలు ఇంకా చ‌లామ‌ణిలో ఉన్నాయి.వాటిల్లో ఒక‌టి ఈ శ్రీ‌శైలం  మ‌ల్లికార్జున‌స్వామి ఆల‌యం.ఈ ఆల‌యంలోని శివ‌లింగాన్ని న‌మ్మిన భ‌క్తులు త‌మ నుదుటితో తాకితే అదో మెత్త‌టి దూది పింజెను స్పృశించిన అనుభూతి క‌ల్గ‌డం విశేషం.దేశంలో గ‌ల 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం రెండో అతి పురాత‌న విశిష్ట‌క్షేత్రం.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూల్ జిల్లాలోని న‌ల్ల‌మ‌ల గిరుల్లో సాక్షాత్తూ ప‌ర‌మ‌శివుడు కొలువుదీరాడ‌ని అత్య‌ధిక హిందువుల విశ్వాసం.అందువల్ల‌నే రాష్ట్రంలో తిరుమ‌ల త‌ర్వాత అంత‌టి పుణ్య‌క్షేత్రంగా భ‌క్తుల మ‌న్న‌న‌ల్ని ఈ శ్రీ‌శైలం క్షేత్రం పొందుతోంది.కృష్ణాన‌ది ప‌రీవాహ‌క ప్రాంతంలో ఉందీ పుణ్య‌స్థ‌లం.హైద‌రాబాద్‌కు ద‌క్షిణం వైపు 230 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి శ్రీ‌శైలం చేరుకోవ‌చ్చు.ఆదిశంక‌రాచార్యులు ఇక్క‌డ మ‌ల్లికార్జునుణ్ని ద‌ర్శించాకే శివానంద‌ల‌హ‌రిని ర‌చించారు.ఈ ఆల‌యంలో కొలువైన మ‌ల్లికార్జునుడు శివుని ప్ర‌తిరూపం కాగా భ్ర‌మ‌రాంబ సాక్షాత్తూ పార్వ‌తీదేవి స్వ‌రూపం.
అల‌రించే దివ్య‌స్థ‌లి: 12వ శ‌తాబ్దం నుంచి ప్రాచుర్యంలో ఉన్న అక్కమ‌హాదేవి గుహ‌ల్ని తిల‌కించే సంద‌ర్శ‌కుల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ త‌గిన ఏర్పాట్లు చేసింది. ఇక్క‌డ నిర్మిత‌మైన 512 మీట‌ర్ల పొడ‌వైన డ్యాం,విద్యుత్ కేంద్రం కూడా సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు క‌ల్గిస్తుంటాయి. 3,568 ‌
చ‌..మీ విస్తీర్ణంలో గ‌ల శ్రీ‌శైలం అభ‌యార‌ణ్యం పులులు, చిరుత‌లు, ఎలుగు, హైనా, లేళ్లు, అడ‌వి పిల్లులు త‌దిత‌ర వ‌న్య‌ప్రాణుల‌తో అలరారుతోంది.ఈ డ్యాం జ‌లాల్లో వివిధ ర‌కాల మొస‌ళ్లు మ‌నుగ‌డ సాగిస్తుంటాయ‌ట‌.గుంటూరు,హైద‌రాబాద్‌ల నుంచి విస్తారంగా బ‌స్సులు న‌డుస్తుంటాయి. మార్కాపూర్‌, క‌ర్నూల్‌, గుంటూరుల నుంచి అనేక రైళ్లు తిరుగుతున్నాయి. హైద‌రాబాద్‌ నుంచి శ్రీ‌శైలానికి విమాన సౌక‌ర్యం కూడా ఉంది.


జ్యోతిర్లింగ క్షేత్రాలు:భార‌త్‌లో 12 జ్యోతిర్లింగ క్షేత్రాల జాబితా... 1)సోమనాథ్‌- ... ప్ర‌భాస్ ప‌ఠాన్‌, సౌరాష్ట్ర‌(  (గుజ‌రాత్‌), 2)మ‌ల్లికార్జున‌-శ్రీ‌శైలం (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌), 3)మ‌హా కాళేశ్వ‌ర్‌-మ‌హాక‌ల్‌,ఉజ్జ‌యిని(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌), 4)ఓంకారేశ్వ‌ర్‌-న‌ర్మ‌ద ఐలాండ్‌,ఓంకారేశ్వ‌ర్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌),5)కేదార్‌నాథ్‌-కేదార్‌నాథ్‌(ఉత్త‌రాఖండ్‌),6)భీమ‌శంక‌ర్‌-భీమ‌శంక‌ర్‌(మ‌హారాష్ట్ర‌),7)కాశీ విశ్వ‌నాథ్‌-వార‌ణాసి(ఉత్త‌రప్ర‌దేశ్‌),8)త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌-త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌, నాసిక్‌(మ‌హారాష్ట్ర‌), 9)వైద్య‌నాథ్‌- వైద్య‌నాథ్‌(జార్ఖండ్‌),10) నాగేశ్వ‌ర్‌-(మ‌హారాష్ట్ర‌,ఉత్త‌రాఖండ్‌), 11) రామేశ్వ‌ర్‌- రామేశ్వ‌ర్‌( త‌మిళ‌నాడు),12) గ్రిష్ణేశ్వ‌ర్‌- ఎల్లోరా, ఔరంగాబాద్‌( మ‌హారాష్ట్ర‌)..

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...