himalayas


అందానికి అతికిన‌ట్లు స‌రిపోయే నిర్వ‌చ‌నం హిమాల‌య ప‌ర్వ‌తాలు. ప్ర‌కృతే పుల‌కించిపోయే సుంద‌ర శిఖ‌రాల సంద‌ర్శ‌న ఓ అనిర్వ‌చ‌నీయ అనుభూతే. అందుకేనేమో ఈ ప‌ర్వ‌త శిఖ‌రాగ్రాల‌కు చేరుకోవాల‌నే ఉబ‌లాటం ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న ఔత్సాహికుల్లో నెల‌కొంటోంది. అలాంటి ఉత్సాహంతోనే 
ఈ ప‌ర్వ‌త శ్రేణుల్లో గ‌ల ప్ర‌పంచంలోనే ఎత్తైన ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని నేపాల్‌కు చెందిన అపా షెర్పా 21సార్లు అధిరోహించి గిన్నిస్‌బుక్ రికార్డుల‌కు ఎక్కాడు. అందుకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ చీఫ్ ఎడిట‌ర్ క్రెగ్ గ్లెండ్ చేతుల మీదుగా ధ్రువ‌ప‌త్రాన్ని ఈ ఏడాదే అపా అందుకున్నాడు. భార‌త‌దేశానికి పెట్ట‌ని కోటైన ఈ ప్రాచీన ప‌ర్వ‌తాల చెంత‌నే నేపాల్‌,బూటాన్‌,చైనా,పాకిస్థాన్‌ల స‌రిహ‌ద్దులూ ఉన్నాయి.
`మంచి`కొండ‌లు:హిమాల‌య ప‌ర్వ‌తాల వ‌య‌సు ఆరుకోట్ల ఏళ్ల  
పైమాటే అని ఓ అంచ‌నా. విస్తీర్ణం ఆరువేల కిలోమీట‌ర్లు. 
ఈ సాణువుల్లోనే గ‌ల ఎవ‌రెస్ట్ శిఖ‌ర‌మే ఇప్ప‌టికీ ప్ర‌పంచంలోనే ఎత్తైన శిఖ‌రంగా ఖ్యాతినొందుతోంది. 1865లో బ్రిటిష్ స‌ర్వేయ‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా స‌ర్ జార్జ్ ఎవరెస్ట్ నేతృత్వంలోని అధికారుల బృందం 8848 మీట‌ర్ల ఎవ‌రెస్టే భూమ్మీద అత్యంత ఎత్తైన శిఖ‌రంగా నిర్ధారించింది. నేపాల్‌లో ఈ మంచు కొండ‌కు సాగ‌ర‌మాత (గాడెస్ ఆఫ్‌ది యూనివ‌ర్స్‌) గా పేరు.టిబెటన్లు చొమెలంగ్మా (మ‌ద‌ర్ గాడెస్ ఆఫ్ ది యూనివ‌ర్స్‌) గా పిలుస్తారు.ఎవ‌రెస్ట్‌పై తొలిసారి అడుగిడిన ఘ‌న‌త‌ను ఎడ్మండ్ హిల్ల‌రీ(న్యూజిలాండ్‌),టెన్జింగ్ నార్గే(నేపాలీ షెర్పా) ద‌క్కించుకున్నారు.సౌత్‌కొల్ రూట్‌లో 29 మే 1953లో వీరిద్ద‌రూ ఎవ‌రెస్ట్‌ను చేరుకున్నారు.ఈ ప‌ర్వ‌త శిఖ‌రాన్ని అప్ప‌టి నుంచి అనేక వేల మంది అధిరోహిస్తూనే ఉన్నారు.వ‌యో లింగ భేదాల‌కు అతీతంగా ఎంద‌రో ఎవ‌రెస్ట్ సాహ‌స‌యాత్ర సాగిస్తూనే ఉన్నారు.ఆక్సిజ‌న్ లేకుండాను కొంద‌రు ఎవ‌రెస్ట్‌పైకి చేరుకొని రికార్డులు సృష్టించారు.అయితే ప‌ర్వ‌తారోహకులు,ఔత్సాహికులే కాకుండా విజ్ఞాన‌యాత్ర‌ల్లాగా కూడా ఎవ‌రెస్టును ఎక్కాల‌ని బోలెడు మంది ఉవ్విళ్లూరుతూనే ఉన్నారు.అయితే ఈ ఎవ‌రెస్ట్ ప‌ర్య‌ట‌న ఖ‌ర్చుతో కూడుకున్న‌దే కాక అత్యంత ప్ర‌మాద‌భ‌రిత‌మ‌యింది కూడ.మంచు చ‌రియ‌లు విరిగిప‌డ్డం,ప్ర‌చండ గాలులు,ఆక్సిజ‌న్ ర‌హిత వాతావ‌ర‌ణం ఎవ‌రెస్ట్ అధిరోహ‌ణ‌ను ఓ దుస్సాహ‌సంగానే ప‌రిగ‌ణింప‌జేస్తోంది.1996నాటి దుర్ఘ‌ట‌నే అందుకు ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ‌.ఆ ఏడాది మే 11న ఏకంగా 16 మంది ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తారోహ‌కులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.అంత‌కు ముందెన్న‌డు అంత‌మంది ఈవిధంగా మృత్యువాత ప‌డిన దుర్ఘ‌ట‌న సంభ‌వించ‌లేదు.ముఖ్యంగా సౌత్‌కొల్‌ను డేంజ‌ర‌స్ జోన్‌గా పేర్కొంటారు.కానీ ఆ మార్గంలోనే ఎవ‌రెస్ట్‌కు చేరుకోవాల‌నే వారి సంఖ్యే ఎక్కువ‌ట‌.హిమాల‌య ప‌ర్వ‌తాల్లో అత్యంత ఎత్తైన శిఖ‌రం ఎవ‌రెస్ట‌యితే త‌ర్వాత స్థానం గొడ్విన్ అస్టిన్‌ది కాగా కాంచ‌న జంగది మూడో స్థానం.
రికార్డుల గుట్ట‌:మౌంట్ ఎవ‌రెస్ట్‌పై మాన‌వ‌స‌హిత వాహ‌నం కూడా దిగిందండోయ్‌.2005 మేలో ఫ్రాన్స్‌కు చెందిన పైలెట్ డిడైర్ డెల్సాల్ యూరోకాప్ట‌ర్ ఎఎస్‌350బి3 హెలికాప్ట‌ర్‌తో స‌హా ఎవ‌రెస్ట్‌పై దిగాడు.ఇక 13 ఏళ్ల చిరుప్రాయంలోనే జోర్డాన్ రొమెరో మే 2010న టిబెట్ స‌రిహ‌ద్దుల మీదుగా ఎవ‌రెస్ట్‌ను అధిరోహించాడు.మిన్ బ‌హుదూర్ షెర్చాన్ అనే 76 ఏళ్ల ఆసామి నేపాల్ మీదుగా ఎవ‌రెస్ట్‌ను ఎక్కి రికార్డు సృష్టించాడు. ఎవ‌రెస్ట్‌ను ఎక్కిన‌ ఓల్డెస్ట్ ఉమ‌న్‌గా అన్నా జెర్విన్‌స్కా(22మే2000) పేరొంద‌గా తొలి మ‌హిళ‌గా ఖ్యాతి మాత్రం జంకో ట‌బే(1975) సొంత‌మ‌యింది.ఆక్సిజ‌న్ లేకుండా తొలిసారిగా ఎవ‌రెస్ట్‌ను ఎక్కిన రికార్డును మాత్రం ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ మాక‌ర్ట్నీ ద‌క్కించుకున్నాడు.

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...