http://royalloyal007.blogspot.in/2011/09/yuvottama.html
(you can see other posts from this blog, go through with mozilla firefox/google chrome)
(you can see other posts from this blog, go through with mozilla firefox/google chrome)
స్పీడ్ యుగం.. విమానాలతో పోటీ పడుతూ నేలపైనున్న పట్టాలపై వాయువేగాన్ని తలపించేలా రైళ్లు ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో దూసుకుపోతున్నాయి. రోజుకు 24 గంటల సమయం జనానికి సరిపోవడం లేదు.అంతా కాలంతో పోటీపడుతున్నట్లుగా చకచకా పనులు చక్కబెట్టుకుంటున్న తరుణమిది. అందుకు అనుగుణంగా రైళ్లను తీర్చిదిద్దే పనిలో సంపన్న దేశాలతోపాటు వర్ధమాన దేశాలు ప్రణాళికలల్లుతున్నాయి. బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు జపాన్. ఆ దేశం ప్రపంచంలోనే తొలి సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌ను విజయవంతంగా నడిపి తమ దేశవాసులకు అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లోను 2012 నుంచి ఈ దిశగా ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. దేశంలో ఆరు మార్గాల్లో వివిధ విదేశీ రైల్ కన్సార్టియంల సహకారంతో బుల్లెట్ ట్రైన్స్ పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్-చెన్నై,చెన్నై-తిరువనంతపురం,ఢిల్లీ-పాట్నా,ఢిల్లీ-అమృతసర్,అహ్మదబాద్-పూణె,హౌరా-హల్దియాల మధ్య బుల్లెట్ ట్రైన్స్ నడపాలని భారతీయ రైల్వేలు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాయి.
వరల్డ్‌లో అలుపెరగకుండా యంత్రాల్లా పనిచేసే శ్రమ జీవుల గురించి ప్రస్తావించాలంటే ముందుగా జపానీయులనే చెప్పాలి.మేమయినా తక్కువా అని సవాలు చేసే నైజం చైనీయులది.సాధన శోధనల క్రమంలో చైనా నేడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లాంగ్ ట్రాక్‌తో సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లను నడుపుతూ రికార్డు సృష్టించింది.
జపాన్ వర్సెస్ చైనా:విశ్వవ్యాప్తంగా నేడున్న జనాభాలో నాల్గోవంతు వాటా చైనాది.ఇక భారత్‌తో కలుపుకుంటే మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు సగం వంతు మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు.అందుకే పెరుగుతున్న జనాభా వారి ప్రయాణ అవసరాల్ని తీర్చాలంటే వేగవంతమైన రైళ్లే ఏకైక మార్గమని చైనా భావించి 2007 నుంచి బుల్లెట్ రైళ్లను నడుపుతోంది.బీజింగ్,షాంఘై మధ్య ఈ రైళ్లు దూసుకుపోతున్నాయి.కేవలం రెండేళ్లలోనే ఆదేశంలో సుమారు 40 కోట్ల మంది వాయువేగ రైళ్లలో ప్రయాణించడం గమనార్హం.ఇతర రైలు ట్రాక్‌లకు భిన్నమైనవి బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌లు.ఈ ట్రాక్‌లపై మాగ్నటిక్ లెవిటేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో బుల్లెట్ ట్రైన్స్ ప్రయాణిస్తుంటాయి.గంటకు 500కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్స్ నడపాలన్నదే వారి లక్ష్యం.ఈ2-1000 సీరిస్‌లో సిఆర్‌హెచ్2,700టి.లను ఆ క్రమంలోనే అభివృద్ధి పరిచారు.అయితే అతివేగం ఎప్పుడూ అనర్థదాయకమేనన్నది నిజమన్నట్లుగా చైనాలో సూపర్‌ఫాస్ట్ ట్రైన్స్ ఢీకొన్న దుర్ఘటనలో 40మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.దాంతో మరిన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లను అభివృద్ధి పరిచే విషయంలో చైనా ఇప్పుడు సందిగ్ధంలో పడింది.భవిష్యత్‌లో మరిన్ని వాయువేగపు రైళ్లను నడపాల్సిన అవసరమేది తమకు లేదని సిఎస్‌ఆర్ చైర్మన్ జుహజియోంగ్ ఆ నేపథ్యంలోనే ప్రకటనను విడుదల చేశారు.
యూరప్ ఛాలెంజ్: బుల్లెట్ ట్రైన్స్ ఒరవడి ఉరవడి మాకే చెల్లు అనే రీతిలో జపాన్ 2003లోనే గంటకు దాదాపు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్‌ను ట్రయల్ రన్‌గా నడిపి రికార్డు సృష్టించింది.టోక్యో-నగొయ-ఒసాకాల మధ్య ఈ మాగ్లివ్ ట్రైన్ లైన్ ప్రాజెక్టును 2027 నాటికి తమ దేశీయులకు అందుబాటులోకి తేవాలని జపాన్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సుమారు 112 బిలియన్ డాలర్లను వెచ్చించదలిచింది.ఇప్పటికే జపాన్‌లో నిత్యం దాదాపు నాలుగు లక్షల మంది బుల్లెట్ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. యూరప్,అమెరికా,రష్యాల్లోనూ బుల్లెట్ ట్రైన్స్ హవా కొనసాగుతోంది. చైనాలో మాదిరిగానే 2007 నుంచే తైవాన్,టర్కీ సహా యు.కె, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్సెయిన్,జర్మనీ ,నెదర్లాండ్స్ తదితర బుల్లెట్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి.
తైవాన్‌లో కౌసిఅంగ్,తైపీల మధ్య బుల్లెట్ ట్రైన్ గంటకు దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. టర్కీ,సౌత్ కొరియాల సంయుక్త ప్రాజెక్టుగా ఈ వాయు వేగ రైళ్లు పరిగెడుతున్నాయి. రష్యాలో 2002 చివరి నుంచే మాస్కో,సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల నడుమ బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించింది. యు.కెలో అండర్ గ్రౌండ్‌లోనూ ఈ వాయువేగ రైళ్లు నడుస్తుండడం విశేషం. అయితే ఈ రైళ్ల వేగంతోపాటు భయంకర ప్రమాదాలను రుచి చూపిస్తున్నాయి. జర్మనీలో 2004లో హైస్పీడ్ ట్రైన్ ఇలాగే ప్రమాదం బారినపడి 25 నిండు ప్రాణాలు బలయ్యాయి.
టాప్-5 బుల్లెట్ ట్రైన్స్:*సిఆర్‌హెచ్380ఎ-చైనా-487.3 కిలోమీటర్ల వేగం,*టి.ఆర్-09-జర్మనీ-450 కి.మీ.వేగం,*షింకన్‌సన్-జపాన్-443 కి.మీ. వేగం,*టి.జి.వి రెసెవ్-ఫ్రాన్స్-380 కి.మీ.వేగం,*కె.టి.ఎక్స్2-సౌత్ కొరియా-352 కి.మీ.వేగం
No comments:
Post a Comment