babaji

http://royalloyal007.blogspot.in/2012/09/t-hunts-down-d.html
శ‌రీరం అశాశ్వ‌తం..ఆత్మ శాశ్వ‌తం..ఇది స‌ర్వుల విశ్వాసం.జ‌న్మించిన వారికి మ‌ర‌ణం త‌ప్ప‌దు.మ‌ర‌ణించిన వారికి జ‌న‌నం త‌ప్ప‌దు అనేది గీతాసారం.అయితే చిరంజీవులు ఉండ‌రా?హ‌నుమంతుడు చిరంజీవి..హిమాల‌యాల్లో ఇంకా త‌ప‌స్సులో నిమ‌గ్న‌మై ఉన్నాడ‌న్న‌ది పురాణాల ఆధారంగా హిందువుల్లో అత్య‌ధిక సంఖ్యాకుల న‌మ్మిక‌.న‌మ్మ‌కం మ‌నిషికో ఆయుధం.ఇత‌రుల‌కు భంగ‌క‌రం కానంత‌వ‌ర‌కు,అది మూఢ న‌మ్మ‌కంగా పెడ‌దారి ప‌ట్ట‌నంత‌కాలం ఎవ‌రైనా ఆచ‌రించ‌వ‌చ్చు.ఆ కోవ‌లోనే ఇప్ప‌టికీ రెండువేల ఏళ్లగా మ‌హావ‌తార బాబాజీ స‌జీవంగా విరాజిల్లుతున్న‌ట్లు భావించేవారు ఉన్నారు.ఏ విశ్వాస‌మైనా మ‌తాసార‌మైనా ఒక్క‌టే మంచిని పెంచ‌డం,శాంతిని స్థాపించ‌డ‌మే.సృష్టి ఉన్న‌ప్ప‌టి నుంచి సైన్స్ ఉంది.సాధ‌న‌,శోధ‌న అనే క్ర‌మంలో అది కొన‌సాగుతూనే ఉంది.సూర్య‌చంద్రాదులున్నంత వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంటుంది.నిన్న‌టి సిద్ధాంతం రేప‌టిరోజున త‌ప్పుకావ‌చ్చు.నిన్న‌టి ప‌రిశోధ‌న‌లు నేటికి నిజంగా చ‌లామ‌ణి అవ్వొచ్చు.భ‌విష్య‌త్‌లో మ‌రో శోధ‌న ఇదే క‌చ్చితం అంటూ నిరూపించవ‌చ్చు.అయితే ఏదీ ప‌రిపూర్ణం కాదు.సైన్స్ ప‌రిభ్ర‌మణంలో అవ‌న్నీ ద‌శ‌లు.అందుకే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ శాస్త్ర‌వేత్త‌లు,వైద్యాచార్యులు సైతం మిస్ట‌రీలను కొట్టివేయ‌డం లేదు.అద్భుతాల‌ను కాదంటూ బ‌ల్ల‌గుద్దడం లేదు.ప్ర‌పంచంలో మొత్తం మాన‌వాళి ఇంకా పాత‌,కొత్త విష‌యాల‌ను తెలుసుకొనే ప్ర‌య‌త్నంలోనే ముందుకు వెళ్తోంది.
బాబాజీ:భార‌త‌దేశానికి పెట్ట‌ని కోట‌యిన హిమాల‌యాల్లో రెండువేల ఏళ్ల‌గా జీవిస్తున్న యోగి ఈ మ‌హావ‌తార బాబాజీ.నిత్య య‌వ్వ‌నుడు.చిరంజీవి.మ‌హాకాయ బాబాజీగానూ భ‌క్తులు పిలుచుకుంటారు.`క్రియా యోగ`ప్ర‌దాత‌.మెడ‌లో రుద్రాక్ష‌లు,ఒళ్లంతా పులిమిన‌ట్లు క‌న్పించే బూడిద‌,నుదుటిన కుంకుమ‌బొట్టు..ఆక‌ర్ష‌ణీయ‌మైన ముఖ‌వ‌ర్చ‌స్సు,వెలుగులు విర‌జిమ్మే నేత్రాల‌తో ప‌ద్మాస‌న ముద్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని హిమాల‌య సాణువుల‌కు వెళ్లే సాధువులు,రుషులు,ప‌ర‌మ భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు.బ‌ద్రీనాథ్‌కు ఎగువున గ‌ల శిఖ‌రాల్లో బాబాజీని ఆర్తిగా స్మ‌రిస్తే ఆ దివ్య పురుషుడు ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ట‌.మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఆ స్వామి కొలువున్న‌ట్లు అనిపిస్తుంది.ఎంత న‌డిచినా ఆ యోగి ద‌రికి మాత్రం చేర‌లేమ‌ట‌.ఇంత‌కు ముందు మ‌న‌కు క‌నిపించినంత‌టి దూరంలోనే ఉండి బాబాజీ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు భావ‌న క‌ల్లుతుంద‌ట‌.ఈ విశ్వాసం త‌ర‌త‌రాలుగా వేల ఏళ్లుగా హిమాల‌య శిఖ‌రాల్లో సంచ‌రించే సాధువులు,బాబాలు,యోగుల్లో ఉంది.ఇప్ప‌టికీ చాలామంది భ‌క్తులు న‌మ్ముతారు.సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ బాబాజీ ఉనికిని బ‌లంగా న‌మ్మే వారిలో ఒక‌రు.ఎంత‌గానంటే ఏడాదికో రెండేళ్ల‌కోసారి ఆయ‌న దాదాపు ఆరునెల‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.ఎక్క‌డుంటారంటే నెల‌ల త‌ర‌బ‌డి హిమాల‌యాల్లోనే బాబాజీ ధ్యానంలోనే గ‌డుపుతారు.ఆ బాబాజీ పేరు మీద ఏకంగా ఆయ‌న బాబా అనే సినిమాను కూడా చిత్రీక‌రించారు.
యోగా-చిరంజీవి: యోగా సాధ‌న ఆరోగ్య‌దాయ‌కం.త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణం పెరిగే అవ‌కాశ‌ముంది.హిమాల‌యాల్లో స్వ‌చ్ఛ‌మైన ప్ర‌కృతి ఒడిలో ఆశ్ర‌మ జీవ‌నం గ‌డ‌పడం,సంజీవిని త‌ర‌హా ఔష‌ధ మొక్క‌లు,వ‌న‌మూలిక‌లు,పండ్లు,కంద‌మూలాలతో కూడిన ఆహారం త‌మ‌ను చిరంజీవుల్ని చేస్తుందంటారు యోగులు.స్థిర‌చిత్తం,స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌లు కూడా వారి జీవ‌నానికి వ‌రాలే.అందుకే వంద‌ల ఏళ్లు జీవించే బాబాలు,యోగినుల‌కెంద‌రికో హిమాల‌యాలు వేదిక‌.ప‌ర‌మ‌హంస యోగానంద త‌న `యోగి`అనే పుస్త‌కంలో బాబాజీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు.క్రియా యోగాల‌యాన్ని నిర్వ‌హిస్తున్న కెన‌డాకు చెందిన మార్ష‌ల్ గోవింద‌న్ కూడా త‌ను రాసిన ప‌లు పుస్త‌కాల్లో ఎన్నో అద్భుత‌,కొత్త విష‌యాల్ని పేర్కొన్నారు.ఆరోగ్యప‌రిర‌క్ష‌ణ‌కు యోగా చ‌క్క‌ని వ‌న‌రు.ఆయుర్వేదం భార‌త్‌కు చెందిన ప్రాచీన వైద్య‌విధానం.ఎన్నో దీర్ఘ‌కాలిక వ్యాధుల నివారిణి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోగ‌పీడితులకు అమృత తుల్యంగా మ‌న్న‌న‌లు పొందుతోంది.ఇక హిమాల‌యాల్లో వ‌న‌మూలిక‌ల‌కు కొద‌వుండ‌ద‌ని అందుకే అక్క‌డ యోగులు చిరంజీవులుగా ఉండ‌డం సాధ్య‌మేన‌ని వివిధ స‌ద‌స్సుల్లో స‌ద‌స్స్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.బాబాజీ ప్ర‌భావం ఆదిశంక‌రాచార్య‌,క‌బీర్‌,షిర్డీసాయిబాబా,గ‌జాన‌న మ‌హ‌రాజ్‌,స్వామి స‌మ‌ర్తా త‌దిత‌రుల‌పైన ఉంద‌ని కాలిఫోర్నియాలో జ‌రిగిన ఓ అధ్యాత్మిక స‌ద‌స్సులో కొంద‌రు త‌మ‌ భావ‌న‌గా పేర్కొన్నారు.మ‌హాత్మాగాంధీ,పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌దిత‌ర ప్ర‌ముఖులెంద‌రికో వైద్యం చేసిన డాక్ట‌ర్ రామ్‌బోస్లే(బొంబాయి)బాబాజీకి ప‌ర‌మ‌భ‌క్తులు.విదేశాల్లో జ‌రిగిన 160కు పైగా స‌ద‌స్సుల్లో పాల్గొన్న ఆయ‌న బాబాజీకి సంబంధించి త‌న‌కు గ‌ల అనేక అనుభూతుల్ని వివిధ వేదిక‌ల‌పై పంచుకున్నారు.బాబాజీ అద్వితీయ‌మైన మహాపురుషుడిగా ప‌లు ప‌త్రాలు,పుస్త‌కాల్లో పేర్కొన్నారు.
-------------------------------------------------------------------------------
జీవ‌న ప్ర‌మాణం:భార‌త్‌లో జీవ‌న‌ప్ర‌మాణం 64 ఏళ్లు.
(మ‌నిషి నూరేళ్లు జీవిస్తాడంటారు.వందేళ్ల‌కు పైగా బ‌తికిన వాళ్లు,ప్ర‌స్తుతం బ‌తుకుతున్న వాళ్లు ప్ర‌పంచం న‌లుమూల‌లా ఇప్ప‌టికీ కొంద‌రున్నారు.అలాగే భార‌త్‌లో కూడా ఉన్నారు.)

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...