పుట్టిన రోజు మనలో చాలామందికి ఓ పండుగ రోజు. అందుకు హాలివుడ్ తారలు అతీతులు కారు.నవంబర్ 11, హ్యాపీ బర్త్‌డే హాలివుడ్ తారలే వీరు. టైటానిక్ సినిమా లవర్ బాయ్ లియొనార్డొ డికాప్రియో,డెమిమోర్, బిబి అండర్సన్ (స్పెయిన్).
అమెరికాలో ఈ రోజును వెటరన్స్ డేగా నిర్వహిస్తారు. కెనడా, ఆస్ట్రేలియాల్లో రిమెంబరెన్స్‌డేగా పాటిస్తున్నారు.అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ప్రజానీకం ఈ రోజున 11 గంటలకు తమ కోసం, దేశం కోసం అమరులైనసైనికులకు మౌనంగా నివాళులర్పిస్తారు.
కాలచక్ర భ్రమణంలో సెకన్లు, నిమిషాలు, గంటలు ఒకటేమిటి రోజులు,నెలలు, ఏళ్లు గిర్రున తిరాగాల్సిందే.వర్తమానం రేపొచ్చే భవిష్యత్‌కు భూతకాలమే. అలాగే కాలమనే వాహనంలో మన ముంగిటకొచ్చిందీ 11-11-11. ఇదో న్యూమరికల్ వండర్ డే. అందుకే యావత్ మానవాళి ఈరోజుకు వెల్‌కం చెప్పి సంబరపడుతోంది.
నాటి నుంచి నేటి వరకు 11/11 ఘటనలు
* 1493: లుసాబాను కొలంబస్ కనుగొన్న రోజు.
* 1688: ప్రిన్స్ విలియమ్స్3 ఇంగ్లాండ్‌లోకి ప్రవేశించారు.
* 1811: కొలంబియా (స్పెయిన్ నుంచి) స్వాతంత్ర్యం పొందింది.
* 1851: అల్వన్ క్లార్క్ టెలిస్కోప్‌పై పేటేంట్ దక్కించుకున్నారు.
* 1865: మేరి ఎడ్వర్డ్ వాకర్ (ఫస్ట్ ఆర్మీ ఫిమేల్ సర్జన్)కు మెడల్ ఆఫ్ ఆనర్ లభించింది.
* 1889: వాషింగ్టన్ 42వ అమెరికా సంయుక్త రాష్ట్రంగా ఆవిర్భావం.
* 1909: పెరల్ హార్బర్ నేవీబేస్ పనుల ప్రారంభం.
* 1918: పోలాండ్‌కు స్వాతంత్ర్యం వచ్చింది.
* 1925: కాస్మిక్‌రేస్‌ను కనుగొన్నట్లు రాబర్ట్ మిలికన్ ప్రకటన.
* 1930: రిఫ్రిజిరేటర్ పేటేంట్‌ను అల్బర్ట్ ఐన్‌స్టీన్, లియో సిజిలార్‌లు పొందారు.
* 1938: నాజిలో జర్మన్, ఆస్ట్రియాలకు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
* 1942: ఫ్రాన్స్‌ను హస్తగతం చేసుకున్న జర్మనీ.
* 1966: నాసా అంతరిక్షనౌక జెమినీ12ను ప్రయోగించింది.
* 1968: మాల్దీవులు రిపబ్లిక్‌గా అవతరణ.
* 1975: పోర్చుగల్ నుంచి అంగోలాకు స్వాతంత్ర్యం.
* 1980: సోయజ్35 బృందం భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు.
* 1985: ఛాలెంజర్ కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో సేఫ్‌గా ల్యాండయింది.
* 1992: ఆంగ్లికన్ చర్చ్ ఫిమేల్ ప్రిస్ట్స్‌ను అనుమతిచ్చింది.
* 2004: యాసర్ అరాఫత్ మరణం. ఆయన స్థానంలో పిఎల్ఒ ఛైర్మన్‌గా మహ్మద్ అబ్బాస్ ఎంపిక.
* 2008: ఎలిజబిత్ రాణి2 దుబాయ్ విచ్చేశారు.
_____________________________________________________________
నెలల పేర్లు ఇలా ...
జనవరి: janu`s month, ఫిబ్రవరి: month of februa, మార్చి: mar`s month, ఏప్రిల్:aphrodite`s month, మే: maia`s month, జూన్: juni`s month, జులై: juliu`s caesar`s month, ఆగస్ట్: augustus caesar`s monthసెప్టెంబర్: the seventh month, అక్టోబర్: the eighth month, నవంబర్: the nineth month, డిసెంబర్: the tenth month.
జాను అనే రోమన్ దేవుడు పేరిటనే ఈ నెల వచ్చింది. ఈ దేవుడికి రెండు ముఖాలుంటాయి. దేవుడికి ఉత్సవం నిర్వహించే నెలయినందునే జనవరి పేరు వచ్చింది. రోమన్ కేలండర్ప్రకారం అయితే ఏడాదికి 10 నెలలే. అయితే 700 బిసి లో రోమ్ సిర్కా ప్రభువు తన హయాంలో జనవరి, ఫిబ్రవరి నెలల్నిఅదనంగా చేర్చారు. తదనుగుణంగా నెలలో అంతకు ముందుండే రోజుల్ని సవరించి 12 నెలలుగా సర్దుబాటుచేశారు. అలాగే ఫిబ్రవరి లీపు సంవత్సరం ప్రారంభమయింది.
No comments:
Post a Comment