ప్రపంచమే నేడో కుగ్రామం. ఇదో యాంత్రిక యుగం కూడాను. అలసిసొలసిన మనసులు కోకొల్లలు. ఆ మనసులకు కాసింత ఆహ్లాదం కచ్చితంగా అవసరం. అందుకే ప్రతివారూ స్థలమార్పు కోరుకుంటారు.
ఓ కొత్త చోటుకు వెళ్లి సేద తీరుతారు..మళ్లీ కొంగొత్త శక్తితో పాత జీవితంలో నిమగ్నమైపోతుంటారు. అందుకే నేడు ప్రపంచంలో టూరిజం అంతగా బిజీబిజీ రంగమై పోయింది. భూమిపై ప్రకృతి పరుచుకున్న అందాలకు కొదవేముంది. కొన్ని మానవ నిర్మితాలయితే మరికొన్ని ప్రకృతి ప్రసాదితాలు. ఆ మానవ అద్భుత సృష్టిల గురించి చెప్పుకుంటేపోతే ఎన్నెన్నో. అందులో ఒకటిగా చెప్పుకోదగ్గ గార్డెన్ భారత రాజధాని ఢిల్లీలోని మొగల్ గార్డెన్. ఈ పూదోట తాజ్‌మహల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్ (కాశ్మీర్)ల స్థాయిలోనే అలరించే ఆహ్లాదం. ఇంకా వర్ణించి పోల్చి చెప్పాలంటే యూఎస్.గార్డెన్స్, హలాండ్ గార్డెన్స్ (ఇటలీ), గార్డెన్స్ ఇన్ స్పెయిన్‌లకు సరిసాటి. అలరించే ప్రకృతి అందాలతోనే కాక అనేక ఔషధమొక్కలు, కూరగాయలు, రకరకాల చెట్లకు నిలయం. మనస్సును ఊహాల్లో తేలియాడించే ఫౌంటెన్లు ఇక్కడ అనేకం కొలువు దీరాయి.
రాష్ట్రపతి భవన్-మొగల్‌గార్డెన్స్: ఈ అందాల పూదోట భారత ప్రధమపౌరుడు ఉండే రాష్ట్రపతి భవన్‌లో నెలకొని ఉంది.
ఆరు హెక్టార్లలో (15ఎకరాల) ఈ అందం మొగల్ ,బ్రిటిష్ సమ్మిళిత శైలీ రూపం. సర్ ఎడ్వర్డ్ లిటిన్స్ ఈ గార్డెన్స్ రూపశిల్పి. ఈ గార్డెన్ మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. రెక్టాంగ్లర్, లాంగ్, సర్క్యూలర్ గార్డెన్లగా కనువిందు
చేస్తుంది. అయితే ఏడాదిలో రెండు నెలలు ఫిబ్రవరి, మార్చిల్లో మాత్రమే మొగల్ గార్డెన్స్ సందర్శనకు ప్రజల్ని అనుమతిస్తారు. ఉదయం 9.30-2.30 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. సోమవారాల్లో మాత్రం నిర్వహణ నిమిత్తం ఈ గార్డెన్స్‌ను మూసివేస్తారు. ఈ గార్డెన్‌ను జె.ఎఫ్.కెన్నడీ, ఎలిజబిత్ రాణి, అబ్రహం లింకన్, క్రిస్టియన్ డైర్ తదితర విదేశీ ప్రముఖులు సందర్శించారు.
సర్క్యూలర్ గార్డెన్:గార్డెన్‌లోకి ప్రవేశించగానే ప్రధాన భవనం పక్కగా ఉండేది సర్క్యూలర్ గార్డెన్. ఇందులో గుభాళించే పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు, చెట్లు అనేకం కనిపిస్తాయి. ఒబెసిటి, డయాబెటిస్, కేన్సర్ నివారణ మొక్కలు అనేకం ఉంటాయి. బ్రహ్మి, స్టేవియా, పావింకిల్ తరహా మొక్కల్ని మనం చూడొచ్చు. కాస్త ముందుకు వస్తే వివిధ మ్యూజికల్ ఫౌంటెన్లు మనల్ని పలకరిస్తాయి. ఇక్కడ ఎగిరే రంగురంగుల సీతాకోకచిలుకల అందాలూ కనువిందే.
రెక్టాంగ్లర్ గార్డెన్: ప్రధాన భవనం వెనుకనుండే గార్డెన్ ఇది. పూల మొక్కలు, చెట్లు, చిన్నచిన్న కమలాలతో కూడిన నీటి మడుగులు ఉల్లాసపరుస్తాయి. ఈ గార్డెన్లో వివిధ కూరగాయల పంటలు ఎన్నో కనిపిస్తాయి. మైమరపించే లాన్లతోపాటు అనేక కట్టడాలు చూపుతిప్పుకోనివ్వవు. గులాబీలు, మేరీగోల్డ్, బైగనివెలి, స్వీట్ విలియమ్,విస్కోరియా తదితర పూల మొక్కలు ఎన్నో అందంగా కొలువుదీరి ఉంటాయి.
లాంగ్ గార్డెన్:అందానికే అందం ఈ రోజ్ గార్డెన్. రెడ్‌రోజ్, పింక్, వైట్, డార్క్‌రెడ్, ఎల్లో, ఆరెంజ్ రోజ్‌లు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ పూదోటలకు మొగల్‌గార్డెన్‌లో నాలుగు ప్రధాన నీటి మార్గాల ద్వారా నీళ్లు సరఫరా అవుతాయి.
_______________________________________________________________________
భారత రాష్ట్రపతుల జాబితా
* బాబూ రాజేంద్ర ప్రసాద్:1950-62(రెండుసార్లు రాష్ట్రపతి)
* సర్వేపల్లి రాధాకృష్ణన్:1962-67
* జాకీర్ హుస్సేన్:1967-69
* వి.వి.గిరి:1969-74
* ఫకురిద్దీన్ అలీ మహ్మద్:1974-77
* నీలం సంజీవరెడ్డి:1977-82
* జైల్‌సింగ్:1982-1987
* ఆర్.వెంకట్రామన్:1987-92
* శంకరదయాళ్ శర్మ:1992-97
* కె.ఆర్.నారాయణన్:1997-2002(లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన తొలి రాష్ట్రపతి)
* అబ్దుల్ కలాం:2002-2007
* ప్రతిభాపాటిల్:2007-(తొలి మహిళా రాష్ట్రపతి)
_______________________________________________________________
^ టెస్టుల్లో సచిన్ 15,000 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో వెస్టిండిస్‌పై మాస్టర్‌బ్లాస్టర్ ఈ ఘనతను అందుకోగా ఇక్కడే స్కిప్పర్ ధోని వికెట్ కీపర్‌గా 200వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకుని రికార్డు లిఖించాడు.
No comments:
Post a Comment