మనుషుల్ని తినే మొక్కలు ఉన్నాయా? ఈ విషయమై ప్రపంచ ప్రసిద్ధ జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ 15ఏళ్లపాటు సుదీర్ఘంగా పరిశోధనలు సాగించారు. మొక్కలు పగటిపూట గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అదే రాత్రి వేళల్లో అందుకు పూర్తి భిన్నంగా సృష్టిలోని ఇతర జీవుల మాదిరిగానే ఆక్సిజన్‌ను స్వీకరించి కార్బన్‌డయాక్సైడ్‌ను వదులుతాయి. భూమిపొరల్లోని నీటిని తమ వేర్ల ద్వారా గ్రహించి బతుకుతాయి. అయితే మొక్కలకు మినరల్స్,న్యూట్రింట్స్ అవసరమే. కేవలం మట్టిలో లభించే వాటి ద్వారానే చాలా మొక్కలు జీవిస్తాయి. కొన్ని మొక్కలు రాక్షసజాతి మొక్కలు. అవి మినరల్స్,న్యూట్రింట్స్‌ను కీటకాలు,జంతువుల్ని భక్షించడం ద్వారా కూడా పొందుతాయని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తరహా మొక్కలు కీటకాలు, జంతువులు తమ దరికి చేరగానే ఓ జిగురులాంటి విషపూరిత రసాలను విడుదల చేసి వాటిని చంపేస్తాయి. ముఖ్యంగా ఈ రసాలు కీటకాలు, జంతువుల ఊపిరితిత్తులకు చేరగానే అవి చనిపోయి పడిపోతాయి. అప్పుడు అచ్చు ఓ జంతువు, మరో జంతువును వేటాడి చంపి తిన్నట్టుగానే ఇవీ ఆ మృత జీవాల నుంచి కావాల్సిన ఆహారాన్ని సంగ్రహిస్తాయి.
ఇంతకీ వీటి పేరు ఏమిటంటే కార్నివొరస్, మీట్ ఈటింగ్ ప్లాంట్స్. డార్విన్ వీటిని ఫ్లోరా ఇన్సెక్టివొన్స్‌గా పేర్కొన్నారు. ఆ తర్వాత కాలపు శాస్త్రవేత్తలు వీటి పేరును కార్నివోర్స్‌గా స్థిరపరిచారు. అయితే వీటి వల్ల మనుషులకు ఎంతమాత్రం హాని లేదట. ఈ రాక్షస మొక్కలు అమొర్‌ఫొఫల్స్ జాతికి చెందినవి. వీటిలో ప్రధానమైంది కార్ప్స్ ఫ్లవర్.ఇది 9 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పుతో దృఢంగా ఉండే సార్థకనామధేయురాలు. ఈ తరహా రాక్షసమొక్కల్లో జంతువులకున్నట్లే కోరలు, వాడైన గోళ్లులాగా కాండాల్లో పదునైన ముళ్లుంటాయి. ఏదైనా జీవి చిక్కిందంటే కొండచిలువ చుట్టేసినట్లే ఇవీ తమ గుబుర్లలోకి లాగేసుకొని చంపేస్తాయి. ఇక కార్ప్స్ ఫ్లవర్ విషయానికి వస్తే ఇది రోజుకు 4 అంగుళాల చొప్పున ఒకదశ వరకు పెరిగిపోతూంటుంది. ప్రపంచంలో వాసన వెదజల్లే మొక్కలన్నింట్లోనో ఈ మొక్క నుంచి వెలువడే వాసనే ఘాటయినదిగా రికార్డు ఉంది. ఆ వాసన కూడా ఓ జీవి కళేబరం కుళ్లిపోతే వచ్చే వాసనలాగే ఉంటుంది. ఈ మొక్క ఉనికిని ఆసియా దేశాల్లోనే కనుగొన్నారు. ఈ మొక్క ఇక్కడే పుష్పిస్తుంది. మరే ఖండంలోని దేశాల్లో నాటినా అక్కడ వీటి మొగ్గలు పుష్పించవు. ప్రస్తుతం వీటి జాడ అడవుల్లోనూ కరవయింది.1937లో అమెరికాలోని న్యూయర్క్ బొటానికల్ గార్డెన్‌లోనే శాస్త్రవేత్తల విశ్వ ప్రయత్నాల వల్ల తొలిసారిగా పుష్పించింది. అదీ ఇప్పటికి ఓ డజన్‌సార్లు మాత్రమే పుష్పించిందట.
రాక్షసమొక్కలు:వీనస్ ఫ్లైట్రాప్స్,సండ్యూస్,పిచర్ ప్లాంట్స్,బటర్‌వొర్డ్స్,బ్లాడర్ వొర్ట్స్ తదితరాలున్నాయి.అయితే దాదాపు 40% మొక్కలు మాంసాహారులేననే వాదనా ఉంది. ఫిలిప్పీన్స్‌లో పిచర్ ప్లాంట్‌ను ఇటీవలే కనుగొన్నారు. ఈ మొక్క ఏకంగా ఎలుకలు,తొండలు సహా కుందేళ్లనే ఆరగించేస్తుందట. ప్రస్తుతం ఈ మాంసాహార మొక్కల్లో ఇదే అతి పెద్దదిగా బ్రిటిష్ బ్రాడ్ కాస్టర్ డేవిడ్ ఎటెన్‌బరో 2009లో పేర్కొన్నారు.
______________________________________________________________
* మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ పశ్చిమబెంగాల్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు.
* ఈజిప్టు ఇంకా అట్టుడుకుతోంది. కైరోలోని తెహ్రిన్‌స్క్వేర్ వద్ద సైన్యం జరిపిన కాల్పుల్లో 40 మంది ఆందోళనకారులు అశువులు బాశారు.
* దక్షిణియా కొరియా పార్లమెంట్‌లో డిప్యూటీ స్పీకర్‌పై కిమ్‌సంగ్ అనే సభ్యుడు భాష్పవాయుగోళాన్ని విసిరి కలకలం సృష్టించాడు.
* ధరల పెరుగుదల,కుంభకోణాలకు నిరసనగా కేంద్రమంత్రి శరద్‌పవార్‌పై హరీందర్ సింగ్ అనే వ్యక్తి దాడి చేశాడు.
No comments:
Post a Comment