గ్రహాలెన్ని?ఇ0కా లెక్క తేల్లేదు. అసలు అక్కడ ఏము0దో కూడా ఇ0కా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్య0లో సూపర్ పవర్ ఉ0దా లేదా అన్నది అప్రస్తుతమే కదా! అ0దుకే ఈ స్పీడ్ యుగ0లోనూ ప్రప0చవ్యాప్త0గా నేటికీ కోట్లాది మ0ది తమతమ ఇష్ట దైవాలను భక్తిగా కొలుస్తున్నారు. ముఖ్య0గా భారత్ లో ఆ స0ఖ్య ఇ0కా ఎక్కువ. లౌకిక రాజ్యమైన భారత్ అనేక మతావల0భికులకు వేదిక. ఇక్కడ ముక్కోటి దేవతలను ఆరాధిస్తు0టారు. దేవాలయాలు బోలెడున్నాయి. అ0దులో కొన్ని అతి పురాతనమైనవి. వాటిలో శబరిమల అయ్యప్ప గుడి ఒకటి. 4,000 ఏళ్ల నాటిదిది. ఏటా రె0డు నెలలు మాత్రమే తెరుచుకొనే ఈ ఆలయానికి దాదాపు 4 కోట్ల మ0ది వచ్చి వెళ్తు0టారు. వీరిలో అయ్యప్ప మాలాధారులే ఎక్కువ. గుడి నవ0బర్ రె0డో వార0లో తెరుచుకోగా మ0డల దీక్షకు వచ్చే స్వాములు అయ్యప్పను దర్శి0చుకు వెళ్తు0టారు.మాలాధారులు 41 రోజుల దీక్ష చేపట్టి ఇరుముడిని ధరి0చి శబరి కొ0డకు వస్తారు. స్వాములు దీక్షాకాల0లో పరమనిష్టగా ఉ0టారు. కాళ్లకు చెప్పులు సైత0 ధరి0చక కాలినడకతోనే దట్టమైన అటవీ మార్గ0లోనే వీరు కొ0డెక్కుతారు. మకరజ్యోతి దర్శనానికి జనవరిలో ఇ0కా పెద్ద స0ఖ్యలో భక్తులు వస్తు0టారు.
కాంతిక్షేత్రం: శబరిమలకు మదంగమల,పొటులక అనే పేర్లూ ఉన్నాయి. మదంగస్వామి తిరుగాడిన ప్రాంతమైనందున `మదంగమల`అని పేరు వచ్చింది.పొట్టు అంటే ప్రాచీన తమిళంలో కాంతి అని అర్థం.ఉలక అంటే ప్రాంతమని అర్థం ఉన్నందున పొటులక అనే పేర్లూ ఉన్నట్లు తెలుస్తోంది. రామాయణకాలంలో శబరిని కలిసేందుకు ఇక్కడకు గిరిజనుడైన రామ్‌తో కలిసి స్వామి మదంగ వచ్చారని పురాణాలు చెబుతున్నాయి.పాండ్య రాజ వంశీకులు ఇప్పటికీ ఆలయ సంప్రదాయాల్ని కాపాడ్డంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మోహినీ అవతారంలోని విష్ణువుకి, శివునికి లోకకల్యాణార్థం కల్గిన సంతానమే స్వామి అయ్యప్ప.మత విశ్వాసానికి, లౌకికతత్వానికి ప్రతీక.అందుకే గురుస్వాముల్ని భక్తులంతా ఈశ్వర స్వరూపుడిగా కొలుస్తారు.శబరిగిరిపై 18 కొండల మధ్య గల దట్టమైన అటవీ ప్రాంతంలో అయ్యప్ప వెలిశాడు. అందుకే పంచలోహాలతో తయారయిన 18 మెట్లపైకెక్కే మాలాధారులు అయ్యప్పను దర్శించుకుంటారు. ఇందులో తొలి అయిదు మెట్లు పంచేంద్రీయ కర్మలకు సంబంధించినవి. చూపు,వినికిడి,వాసన,రుచి,స్పర్శలే అవి.
తర్వాత ఎనిమిది మెట్లు కామ, క్రోద, లోభ, మోహ, మధ, మత్సర్య, అసూయ, దూషణలకు సంబంధించినవవి.ఆ తర్వాత మూడు మెట్లు గుణ,త్రిగుణలైన సాత్వ,రాజస,తమా గుణాలు. చివరి రెండు మెట్లు జ్ఞానం, అజ్ఞానాలకు సంబంధించినవి.వీటిని దాటితేనే మాలాధారులకు స్వామి అయ్యప్ప దర్శనం లభిస్తుంది. నీలిమల కొండల్లోని అతి క్లిష్టమైన అటవీ మార్గంలో 3కిలోమీటర్లు నడిచే స్వాములు అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు.పంపా వరకే వాహనాలకు ప్రవేశం ఉంటుంది. కేరళలోని పటనారితెట్ట జిల్లాలోని రన్నీ తాలూకాలోని పెరినాడ్ గ్రామానికి సమీపంలో ఉందీ పురాతన అయ్యప్ప ఆలయం.సినీస్టార్లు అమితాబ్,రజనీకాంత్,రామ్‌చరణ్,నిర్మాత సురేశ్‌బాబు,ప్రముఖ ఇండస్ట్రిలిస్టులెందరో తరచు మాల ధరిస్తూ అయ్యప్పను దర్శించుకుంటుంటారు.ఉరకుజి తీర్థం లోని(సంక్టం సంక్టోరం)వద్ద కొలువు దీరాడు స్వామి అయ్యప్ప.ఈ ఆలయం సముద్ర మట్టానికి 1260 మీటర్ల ఎత్తున ఉంది. మాలాధారులు ఇరుమెలి,వండి పెరియార్,చల్కాయం అనే మూడు వేర్వేరు మార్గాల మీదుగా కొండకు వెళ్తారు.
మకరజ్యోతి:ఈ దివ్య జ్యోతి మానవకల్పితమేనని చాలామందికి తెలుసునని అయితే అత్యధిక సంఖ్యాకులైన హిందువులు దీన్నో పవిత్రజ్యోతిగా భావిస్తారని శబరిమల ఆలయ,ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టిడిబి) పేర్కొంది. పొన్నంబలమేడు వద్ద గిరిజనులు కొందరు ఈ జ్యోతిని వెలిగిస్తారని తమకూ తెలుసని బోర్డు ప్రెసిడెంట్ ఎం.రాజగోపాలన్ నాయర్ పాత్రికేయులకు ఓ సందర్భంలో తెలిపారు.అయితే ఈ విషయానికి తాము ప్రచారం కల్పించదలుచుకోలేదని ఎందుకంటే అత్యధిక హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని ఆయన గుర్తు చేశారు. జనవరి14,2011లో పులిమేడు వద్ద ఏవో వదంతులు రాజ్యమేలడంతో నెలకొన్న తొక్కిసలాటలో 102 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇటువంటి ప్రమాదాల నివారణకు ఏడాది పొడవునా గుడిని తెరిస్తే రద్దీ తగ్గుతుందన్న కేరళ హైకోర్టు సూచనను బోర్డు సున్నితంగా తిరస్కరించింది.అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు విరుద్ధంగా తామిప్పుడు వ్యవహరించలేమని పూజ్య పూజార్లు,ట్రావెన్‌కోర్ అండ్ పాండ్యాలం రాజవంశీకులు,అధికారులతో కూడిన టిడిబి పేర్కొంది. వేల సంవత్సరాలగా ఆచరిస్తున్న సంస్కృతి,సంప్రదాయాలు,ఆలయ విధివిధానాల్లో భాగంగా 18 మెట్ల విస్తరణ కూడా సాధ్యం కాదని బోర్డు సభ్యులైన పూజార్లు కందరామ రాజవరు,వాస్తు నిపుణులు కన్నిపయార్ నారాయణన్ నంబూద్రి తదితరుల బృందం కోర్టుకు విన్నవించింది.ఏది ఏమైనా అత్యధిక సంఖ్యలో భక్తులతో అలరారుతున్న ఈ ఆలయం వద్ద ప్రమాద నివారణ చర్యలకు కేరళ ప్రభుత్వం, బోర్డు నడుం బిగిస్తేనే ఆలయ సంప్రదాయాల్ని కాపాడ్డంతోపాటు స్వాములకు రక్షణ లభిస్తుంది.
_______________________________________________________________
భారత్‌కు డబుల్:ప‌్రపంచ కబడ్డీలో భారత్ జయకేతనం ఎగురవేసింది. పంజాబ్‌లో జరిగిన 14 దేశాల ఈ టోర్నీ ఫైనల్లో భారత పురుషులు, మహిళా జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు కెనడాపై 59-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది.పాకిస్థాన్ జట్టు మూడో స్థానం దక్కించుకుంది. వరుసగా రెండోసారి భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది.
No comments:
Post a Comment