Space post you can see from this blog on october 20
IceMan post on october 21
IceMan post on october 21
- సీపీఐ,సీపీఎం విడివిడిగా ఉంటేనే ప్రయోజనకరమని ఎబిబర్దన్ పేర్కొన్నారు.
- 2030 నాటికి డయాబెటిక్స్ సంఖ్య 55 కోట్లకు చేరుకుంటుందని పలువురు మధుమేహంతో మరణించే ప్రమాదముందని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య(ఐడిఎఫ్) హెచ్చరించింది.
- కేంద్రమంత్రి విలాశ్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు బాలివుడ్ నటుడు రిషి దేశ్‌ముఖ్‌ను పెళ్లాడనున్న టాలివుడ్ హీరోయిన్ జెనీలియా
అమెరికా అనగానే ఠక్కున గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ప్రపంచంలో మరో రెండు స్టాట్యూ ఆఫ్ లిబర్టీలు పారిస్(ఫ్రాన్స్), లగ్జెంబర్గ్(ఇంగ్లాండ్)ల్లో ఉన్నా అందరి మదిలో మెదిలేది న్యూయార్క్ నగరమే. లిబర్టస్ అనే రోమన్ దేవత పేరిటనే లిబర్టీ అనే పదం పుట్టింది. అమెరికా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు నిలువెత్తు నిదర్శనమే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అమెరికా 100వ పుట్టినరోజు కానుకగా ఫ్రెంచ్ ప్రజలిచ్చిన కానుకిది. 1886 అక్టోబర్ 28న అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లెవ్‌లాండ్ ఈ నేషనల్ మాన్యుమెంట్‌ను జాతికి అంకితం చేశారు.
భూతల స్వర్గంగా భాసిల్లుతున్న అమెరికాకే మకుటాయమానం ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్నిఅమితంగా ఆకర్షించే పర్యాటక క్షేత్రం ఈ విగ్రహం కొలువుదీరిన నేషనల్ పార్క్. నార్వేలోని విస్నస్ గనుల్లో ఉత్పత్తి అయిన రాగితో దీన్ని రూపొందించారు. విగ్రహ రూపశిల్పి ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడరిక్ అగస్టే బార్ట్‌హోల్డి.
తీర్చిదిద్దింది ఎడ్వర్డ్ రెనే కాగా ఈఫిల్ టవర్ సృష్టికర్త అలెగ్జాండర్ గుస్టనోవ్ తన వంతు సహకారాన్ని అందించారు.
1776 జులై 4 అమెరికా రివల్యూషన్‌కు ప్రతీకగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పరిగణిస్తారు. ఈ డేట్‌ను విగ్రహంపై 23 అడుగుల మేర 2 అడుగుల మందంతో రోమన్‌లిపిలో చెక్కారు. విగ్రహానికి వైట్ పెయింట్‌ను లోపల,వెలుపల వేయడంతో శాంతికి ప్రతీకగా దవళ వర్ణంతో శోభిల్లుతోంది. 151 అడుగుల ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ సొంత ఖర్చుతో తయారు చేసింది. పెడస్టల్‌ను అమెరికా ప్రభుత్వం నిర్మించగా పౌరులిచ్చిన విరాళాలతో బేస్‌మెంట్ తద్వారా ఈ ప్రాజెక్టు పూర్తయింది. 22 అంతస్తులు గల ఈ విగ్రహ సముదాయంలో మొత్తం 354 వంపులు తిరిగిన మెటల్ మెట్ల వరుస ద్వారా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ శిఖర భాగానికి చేరుకోవచ్చు. ఇందులో192 మెట్లను ఎక్కే సరికే సందర్శకులకు ఇల్లిస్ ఐలాండ్ అందాలు కనువిందు చేస్తాయి. న్యూయార్క్ హార్బర్ సొబగులు మైమరపిస్తాయి. బేస్‌మెంట్ నుంచి విగ్రహం కుడి చేతిలోని కాగడా వరకు మొత్తం ఎత్తు 305 అడుగులు. విగ్రహం ఎత్తయితే 151 అడుగులు. విగ్రహం కళ్ల మధ్య దూరమే దాదాపు 3 అడుగులు. ముక్కు పొడవు 4 అడుగులు కాగా, నోటి వెడల్పు 3 అడుగులు, నడుం వెడల్పయితే ఏకంగా 35 అడుగులు. చూపుడు వేలు 8 అడుగుల పొడవుంటుంది. రెండు చేతుల మధ్య దూరమయితే 17 అడుగులు. విగ్రహం బరువయితే 205 మెట్రిక్ టన్నులు. కిరీటంపై గల ఏడు కోణాలు ప్రపంచంలో గల ఏడు ఖండాలు, ఏడు సముద్రాలకు చిహ్నాలుగా పేర్కొంటారు. కాగడాపై బంగారు వర్ణ కాంతుల్ని 1986లోనే ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం విగ్రహ సముదాయం రెండో అంతస్తులో ఈ స్టాట్యూకు సంబంధించిన చరిత్ర, వస్తువుల ఫొటోలు, వీడియోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. పెడస్టాల్ ద్వారా సందర్శకులు కాగడా, కిరీటం వరకు వెళ్లేవారు. అయితే ట్విన్ టవర్స్ విధ్వంసం తర్వాత 2001 నుంచి కిరీటం పైకి సందర్శకుల్ని అనుమతించడం లేదు. 1916 నుంచే కాగడా పైకి వెళ్లడాన్ని నిషేదించారు.
నేషనల్ పార్క్ సర్వీస్ ఆధ్వర్యంలోని ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రాంగణంలోకి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు సందర్శకుల్ని అనుమతిస్తారు. వేసవిలో మరికొంత సమయం పొడిగిస్తుంటారు.
యావత్ ప్రపంచపు స్వేచ్ఛ,స్వాతంత్ర్యాలకు ప్రతిబింబమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సూర్యచంద్రాదులున్నంత వరకు తిరుగులేని చైతన్య దీపికే.
No comments:
Post a Comment